Siddu Gadi Love Story: ఈ సిద్ధుగాడి లవ్ స్టోరీ చాలా చాలా స్పెషల్.. ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బ్యూటిఫుల్, యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. రమేష్ చెరుకూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత గ్రాండ్‌గా జరిగింది.

News18
News18

వైవిధ్యమైన కథాంశాలతో, సరికొత్త ప్రేమకథలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. కంటెంట్ బాగుంటే చాలు, నటీనటులు కొత్తవారైనా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తారని గతంలో విడుదలైన పలు చిత్రాలు నిరూపించాయి. తాజాగా అదే కోవలో ఒక బ్యూటిఫుల్, యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. రమేష్ చెరుకూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత గ్రాండ్‌గా జరిగింది.

సొంత ఊరిని, కన్నవారిని వదిలి సుదూర తీరాలకు వెళ్లిన ఎంతోమంది ఎన్ఆర్ఐల (NRIs) జీవితాలకు, వారి అంతరంగిక భావోద్వేగాలకు అద్దం పట్టే చక్కని కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు యువత అక్కడి సంస్కృతికి, ఇక్కడి మూలాలకు మధ్య పడే సంఘర్షణను ఈ ప్రేమకథలో హృద్యంగా చూపించబోతున్నారు. మనోజ్ కుమార్, మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సావిత్రమ్మ నిర్మాతగా వ్యవహరించగా.. వి. సాంబశివరావు, వేణు గోపాల చారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నిర్మాతలు హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. సీనియర్ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, వి.ఎన్. ఆదిత్య, వి. సముద్ర, రామ్ ప్రసాద్‌లతో పాటు ప్రముఖ నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, నటులు అశోక్ కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా ఉందోని, ఖచ్చితంగా ఈ తరం యువతకు, ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

ఇక ఈ ఈవెంట్‌లో హీరో మనోజ్ కుమార్ సినిమాలోని ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను లీక్ చేస్తూ క్రేజీ కామెంట్స్ చేశారు. “ఈ కథ దూర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరి లైఫ్‌కు కనెక్ట్ అవుతుంది. సినిమాలో నా ఇద్దరు హీరోయిన్లు రెండు భిన్నమైన సంస్కృతులకు ప్రతీకగా కనిపిస్తారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు అద్దం పడుతూ ‘ముద్దపప్పు-ఆవకాయ’ లాగా చాలా హోమ్లీగా ఉంటే.. మరొకరు తెలంగాణ ఫ్లేవర్‌ను చూపిస్తూ ‘హైదరాబాదీ బిర్యానీ’ లాగా చాలా స్పైసీగా, ఎనర్జిటిక్‌గా నటించారు” అని చెప్పి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతులను మేళవించి రూపొందించిన ఈ వైవిధ్యమైన ప్రేమకథ త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed