Talasani on Voter List: ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక ఆదేశాలు.. మే 1 నుంచి ఇంటింటి సర్వే! | ACTPnews

Talasani on Voter List: ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక ఆదేశాలు.. మే 1 నుంచి ఇంటింటి సర్వే!



సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వెస్ట్ మారేడ్పల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలు, నాయకులు డేగ కన్ను వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వే ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సరిపోలుస్తారని, ఈ క్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO)తో సమన్వయం చేసుకునేందుకు ప్రతి బూత్కు ఒక బీఆర్ఎస్ ఏజెంట్ను నియమించనున్నట్లు తలసాని వెల్లడించారు. ఓట్ల గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports