టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించి వార్తా సంస్థ ‘పీటీఐ’ (PTI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఆటగాళ్ల భవిష్యత్తు గురించి బహిరంగంగా మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. “మా వద్ద ఎంతో అనుభవం ఉన్న నిపుణులు, పటిష్టమైన బృందం ఉంది. జట్టుకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాల్లో క్రికెట్ కమిటీ, సెలక్టర్లు, హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్, సంబంధిత ఆటగాళ్లతో కలిపి అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది” అని సైకియా పేర్కొన్నారు.













