Vaibhav Sooryavanshi: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడేనా? వైభవ్ సూర్యవంశీపై సెలెక్టర్ల సంచలన వ్యాఖ్యలు! | క్రీడా వార్తలు | ACTPnews

వైభవ్ సూర్యవంశీ


Last Updated:

Vaibhav Sooryavanshi: రాబోయే దులీప్ ట్రోఫీ టోర్నీ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్‌గా యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని నియమించడంపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ

ఇంత చిన్న వయసులోనే కుర్రాడికి వైస్ కెప్టెన్సీ వంటి అదనపు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు మాజీలు, విశ్లేషకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వైభవ్ ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, ఈ సమయంలో అతడిపై అనవసర ఒత్తిడి పెంచకూడదని సూచిస్తున్నారు. అయితే, ఈ విమర్శలపై ఈస్ట్ జోన్ సెలెక్టర్ ప్రరంజన్ స్పందించారు. వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై తమ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు.

నాయకత్వ బాధ్యతలతో మరింత రాటుదేలుతాడు

విమర్శలకు సమాధానమిస్తూ సెలెక్టర్ ప్రరంజన్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. “మేం వైభవ్‌ను జట్టు సారథిగా చేయలేదు, కేవలం వైస్ కెప్టెన్‌గా మాత్రమే నియమించాం. ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్‌గా రోజంతా మైదానంలో యాక్టివ్‌గా ఉండే ఇషాన్ నాయకత్వాన్ని నడిపిస్తాడు. వైభవ్ కెప్టెన్సీ భారం మోయాల్సిన అవసరం లేదు. కానీ రోజురోజుకూ పరిణతి చెందుతున్న ఈ కుర్రాడికి ఇలాంటి చిన్నపాటి బాధ్యతలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది అతడికి దక్కిన ఒక గొప్ప అవకాశం. భవిష్యత్తులో వైభవ్ ఏదో ఒక రోజు టీమ్‌ఇండియాకు కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అని ధీమా వ్యక్తం చేశారు.

కమిటీ ఏకగ్రీవ నిర్ణయం

ఐపీఎల్‌తో పాటు ఇటీవల భారత జట్టు తరఫున, దేశవాళీ టోర్నీలలో బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడని సెలెక్టర్ ప్రరంజన్ గుర్తుచేశారు. “వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయాన్ని ఎంపిక కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా, కలిసికట్టుగా తీసుకున్నారు. బయట ఉన్నవారు ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తుంటారు. అందరి ఆలోచనా దృక్పథం ఒకేలా ఉండదు. సెలెక్టర్లుగా మేం ఏం నిర్ణయం తీసుకున్నా అది మా జట్టు శ్రేయస్సు కోసమే” అని ఆయన స్పష్టం చేశారు. నాయకత్వ అనుభవం వైభవ్‌ను మైదానంలో మరింత బాధ్యతాయుతంగా మార్చడానికి తోడ్పడుతుందని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed