Last Updated:
Hyderabad: సోషల్ మీడియా వేదిక ట్విట్టర్(X)లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ఛత్రీనాక సమీపంలో ఓ బైక్‌పై ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి దర్జాగా వెళ్తున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Hyderabad: నిబంధనలు సామాన్యులకేనా ప్రభుత్వంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న వారికి వర్తించా అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ , మోటర్ సైకిల్ యాక్ట్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలను కంట్రోల్ చేయడానికి ఎక్కడిక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికి కొందరు వాటిని లెక్క చేయడం లేదు. తాజాగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్(X)లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ఛత్రీనాక సమీపంలో ఓ బైక్‌పై ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి దర్జాగా వెళ్తున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న బైక్ నంబర్ ఆధారంగా చూస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.














