నేపాల్‌కు వెళ్లే భారతీయ పౌరులకు, అక్కడికి చేరుకునే తేదీ నుండి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ID తప్పనిసరి. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం ‘వీసా ఆన్ అరైవల్’ ఉచితంగా లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.58,300, డబుల్ షేరింగ్‌కు రూ.62,900, సింగిల్ షేరింగ్‌కు రూ.75,600 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో వసతి, ఆరు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లోకల్ టూర్ గైడ్, ఐటినరీలో వివరించిన సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్స్ కవర్ అవుతాయి. 0.2% టీసీఎస్ ఉంటుంది. TCS మొత్తం క్లయింట్ ఆదాయపు పన్ను రికార్డులో జమ చేస్తారు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, క్లయింట్ ఆదాయపు పన్ను శాఖ నుండి రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)













