Last Updated:
ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేయి కళ్లతో, కోటి ఆశలతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేయి కళ్లతో, కోటి ఆశలతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్ ‘హల్లల్లల్లో..’ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఏ.ఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. రక్షితా శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేశాడు. జాన్వీ కపూర్‌తో కలిసి టాలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. స్టెప్స్ అయితే కిరాక్ ఉన్నయ్. సాంగ్ ఇన్‌స్టంట్‌గా ఎక్కపోయినా.. మెల్లి మెల్లిగా శ్రోతలకు నచ్చేలా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్లు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది.
డెబ్యూ సినిమా ఉప్పెనతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన బుచ్చి బాబు సనా.. ఏకంగా 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు పెద్ది సినిమాతో వస్తున్నాడు. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చెప్పాలంటే అనౌన్స్మెంట్ రోజు నుంచే టాలీవుడ్లో మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌లా మారిపోయింది. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన నాగార్జున ‘రక్షకుడు’ తర్వాత.. మళ్లీ ఇన్నేళ్లుగా ఏ.ఆర్ రెహమాన్ ఒక తెలుగు హీరో సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
దాంతో అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఆ తర్వాత చికిరీ అంటూ దేశాన్ని ఊపేశాడు. ఏ.ఆర్ రెహమాన్ పనైపోయిందిరా బాబూ అనుకున్న టైమ్‌లో దేశం మొత్తం చికిరీ సాంగ్ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఆ తర్వాత రై రై రారా అంటూ మరోసారి తన మ్యూజిక్ కెపబులిటీ ఏ రేంజ్లో ఉంటుందో చూపించాడు. పాటలతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన పెద్ది.. కాస్టింగ్‌తో కూడా కిర్రుమనిపించేలా చేశాడు. మిర్జాపూర్తో మున్నాభాయ్‌గా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్న దివ్యేందును విలన్‌గా పెట్టి వా అన్న వా అనిపించుకున్నాడు బుచ్చి. ఇక అసలు గర్తుపట్టని లుక్‌లో జగపతి బాబుని చూపించి టాలీవుడ్‌ను షేక్ చేశాడు.
ఇక కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్‌ను కంప్లీట్ విలేజ్ మ్యాన్‌గా చూపించిన వైనం మాములుగా లేదు. ఇక పల్లెటూరి పిల్లగా జాన్వీ కపూర్‌ను అటు గ్లామర్‌ను, ఇటు పల్లెలూరీ మాస్‌ను మిక్స్ చేసి చూపించడం నెక్స్ట్ లెవల్. మొత్తంగా పెద్ది సినిమాపై మాత్రం బుచ్చి బాబు మామలు అంచనాలు క్రియేట్ చేయలేదు. మరి జూన్ 4న బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సౌండ్ వినబడుతుందో చూడాలి…
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 24, 2026 11:42 AM IST













