Last Updated:
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శనివారం (మే 23, 2026) ఉదయం 11:30 గంటలకు పాలిసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. చెక్ చేసుకునే విధానం ఇదే
TG POLYCET 2026 Results: తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET 2026) రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శనివారం (మే 23, 2026) ఉదయం 11:30 గంటలకు పాలిసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఎస్‌వీ భవన్‌లో ఉన్న ఎస్‌బీటీఈటీ కార్యాలయం నుండి సాంకేతిక విద్యా కమిషనర్ ఈ ఫలితాలను వెల్లడించారు. పాలిసెట్ ఫలితాలతో పాటు ‘ఎల్‌పీసెట్’ (LPCET 2026) ఫలితాలను కూడా అధికారులు ఇక్కడే విడుదల చేయడం గమనార్హం. పరీక్షకు హాజరైన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 13న జరిగితే.. 14న కీ విడుదల చేశారు. 16 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించారు.
ఈ ఏడాది మే 13, 2026న తెలంగాణవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను ఆఫ్‌లైన్ (OMR షీట్) విధానంలో నిర్వహించారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ ప్రవేశ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ విభాగాల నుండి ప్రశ్నలు వచ్చాయి. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ మార్కులు, ర్యాంకులే కీలకం కానున్నాయి.
విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సౌకర్యార్థం ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న డిజిటల్ సేవను అందుబాటులోకి తెచ్చింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గదర్శకత్వంలో.. ‘మీసేవ వాట్సాప్ సర్వీస్’ ద్వారా ఫలితాలను నేరుగా మొబైల్‌కే పంపుతున్నారు. ఇదివరకు మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఎలాంటి విజ్ఞప్తి పంపే అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా వారి వాట్సాప్‌కు ఫలితాల వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇంటర్నెట్ సెంటర్లు, సైబర్ కేఫేలపై ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారిక వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా ఈ సేవలను అందిస్తున్నారు.
వాట్సాప్ కాకుండా బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డ్ పొందాలనుకునే విద్యార్థులు కింది స్టెప్స్ ఫాలో అవ్వవచ్చు:
స్టెప్ 2: ఓపెన్ అయిన కొత్త లాగిన్ పేజీలో మీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 3: వివరాలు ఇచ్చాక ‘Submit’ బటన్‌పై ప్రెస్ చేయండి.
స్టెప్ 5: మీ స్క్రీన్‌పై పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తు అవసరాల (కౌన్సెలింగ్) కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.
పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు సీట్ల కేటాయింపు కొరకు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మే 27, 2026 నుండి పాలిటెక్నిక్ వెబ్ కౌన్సెలింగ్ (Counselling) ప్రక్రియ అధికారికంగా మొదలవుతుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ర్యాంకులకు అనుగుణంగా కాలేజీలను ఎంపిక చేసుకోవడానికి వీలుగా కౌన్సెలింగ్ గైడ్‌లైన్స్, అవసరమైన సర్టిఫికెట్ల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Hyderabad,Telangana
May 23, 2026 11:41 AM IST













